Yedabayani Nee krupa song lyrics in telugu

ఎడబాయని నీ కృప

పాట రచయిత: మాథ్యూస్

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2)      ||ఎడబాయని||

శోకపు లోయలలోకష్టాల కడగండ్లలో
కడలేని కడలిలోనిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2)      ||ఎడబాయని||

విశ్వాస పోరాటంలోఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలోసడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2)      ||ఎడబాయని||

నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని (2)
భారమైన సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2)      ||ఎడబాయని||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *